‘ఆర్ఆర్ఆర్’ లో కొమరం భీం గా తారక్ లుక్ అదిరిపోతుంది : ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్…!!

0
775

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరో లుగా తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, తారక్ కొమరం భీం గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా కోసం హీరోలిద్దరూ కూడా ఆయా పాత్రల్లో నటించడానికి ఎంతో శ్రమపడుతున్నారని సమాచారం. ఇకపోతే సినిమాలో కొమరం భీంగా నటిస్తున్న తారక్, ఆ పాత్ర కోసం ప్రముఖ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. కాగా నేటితో తారక్ ట్రైనింగ్ పూర్తి అయిందని, ఎంతో కష్టపడి కొన్నాళ్ల నుండి ఆయన నా వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు, ఇక అతి త్వరలో కొమరం భీం గా  ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరికొత్త లుక్ మీ అందరినీ ఆశ్చర్యపరచడం ఖాయం అంటూ స్టీవెన్స్ కాసేపటి క్రితం సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం స్టీవెన్స్ చేసిన ట్వీట్, పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here