మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన భద్ర సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను, తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఆ తరువాత పలు సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ప్రస్తుతం బాలయ్యతో ఒక సినిమా తీస్తున్న బోయపాటి తల్లిగారైన శ్రీమతి బోయపాటి సీతారావమ్మ ఈ రోజు రాత్రి 7 గం.22 ని. లకు మరణించారు.
గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బోయపాటి తల్లిగారైన శ్రీమతి బోయపాటి సీతారావమ్మ, తమ స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదకాకానిలోనే ఉంటున్నారు. కాగా ఆమె వయస్సు 80 సంవత్సరాలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బోయపాటి, తల్లి మరణ ఘటన తెలియగానే తన ఫ్యామిలీతో కలిసి హుటాహుటిన పెదకాకాని చేరుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఆమె మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు. ఇక రేపు పెదకాకానిలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నట్లు తెలుస్తోంది….!!