మాస్ మహారాజ రవితేజ ‘డిస్కో రాజా’ లేటెస్ట్ టీజర్ ఎప్పుడంటే……??

0
835

మాస్ మహారాజ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా డిస్కో రాజా. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి రెండు సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమా లేటెస్ట్ టీజర్ ని 2.0 పేరుతో ఈనెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ప్రకటించింది.

రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న డిస్కో రాజా సినిమా లేటెస్ట్ టీజర్ కు ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తుండగా కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని ఈనెల 24వ తేదీన గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తోంది సినిమా యూనిట్….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here