విజయవాడలో సందడి చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

0
319
Happi mobile Inauguration

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టి స్టారర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలతో పాటు అక్కడక్కడ మధ్యలో కొన్ని ఈవెంట్స్ కి హాజరవుతూ ఫ్యాన్స్ ని ఖుషి చేసే రామ్ చరణ్, నేడు విజయవాడ విచ్చేసారు. తాను ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న హ్యాపీ మొబైల్స్ వారు విజయవాడలోని బందర్ రోడ్ లో  రామ్ చరణ్ చేతుల మీదుగా హ్యాపీ మొబైల్స్ నూతన షోరూమ్ లాంచ్  చేసారు.

నేడు విజయవాడలో రామ్ చరణ్ చేతుల మీదుగా హ్యాపీ మొబైల్స్ నూతన షోరూమ్ లాంచ్  చేసారు. ఈ సంస్థతో తనకు చాలా కాలం నుండి మంచి అనుబంధం ఉందని, తప్పకుండా విజయవాడలో లాంచ్ ఆయిన హ్యాపీ మొబైల్స్ నూతన షోరూమ్ కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఇక ఫ్యాన్స్ అంటే తమకు ప్రాణమని, ఇక్కడ ఇంతమందిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, అయితే మీరు అందరూ మాత్రం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీకోసం ఇంట్లోవారు ఎన్నో ఆశాలతో ఎదురుచూస్తుంటారు, దయచేసి ఎవరూ కూడా కారు స్పీడ్ గా డ్రైవ్ చేయకండి అని అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ వ్యాఖ్యానించారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here