‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుండి బిగ్ బ్రేకింగ్ అప్ డేట్…!

1
849

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తుండగా,

ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోయే నటిని మరియు సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న నటుడిని రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తి అయిందని, వచ్చే ఏడాది జులై 30న సినిమా రిలీజ్ తప్పకుండా ఉంటుందని సినిమా యూనిట్ చెపుతోంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here