మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రతిష్టాత్మక మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.