కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా భారీ ప్రతీష్టాత్మక సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేసింది సినిమా యూనిట్.
ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన చారిత్రాత్మక నవల, పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమా తెరక్కుతోంది.
ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, కార్తీ, సిద్దార్ధ్, ఐశ్వర్య లక్ష్మి, త్రిష, శరత్ కుమార్, ప్రభు, జయరాం సహా మరికొందరు ప్రముఖ నటులు నటిస్తున్న ఈ సినిమాను మణిరత్నం తన మద్రాస్ టాకీస్ తో పాటు, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్యంత భారీ ఖర్చుతో,
అత్యున్నత సాంకేతిన ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా, రవి వర్మన్ ఫోటోగ్రఫిని, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ని అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.’పొన్నియిన్ సెల్వన్’ టైటిల్ ఫస్ట్ లుక్. కత్తి గుర్తుతో రిలీజ్ చేసిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది…!!


