డైరెక్టర్ మారుతి కి 10 కోట్ల రెమ్యూనరేషన్ ?

0
317
డైరెక్టర్ మారుతి

‘ఈ రోజుల్లో’ వంటి చిన్న సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యి సూపర్ హిట్ సాధించిన డైరెక్టర్ మారుతి తర్వాత ‘బస్టాప్’ తో మరో ఘన విజయాన్ని అందించారు. ‘భలే భలే మగాడివోయ్’ తో నాచురల్ స్టార్ నాని కెరీర్ కి టర్నింగ్ పాయింట్ హిట్ ను డైరెక్ట్ చేసిన మారుతి టాలెంటెడ్ హీరో శర్వానంద్ తో ‘మహానుభావుడు’ వంటి సూపర్ హిట్ ని అందించారు.

యువ సామ్రాట్ నాగ చైతన్య తో కలిసి మారుతి చేసిన ‘శైలాజరెడ్డి అల్లుడు‘ చైతు కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించింది. ఇక ఇప్పుడు సుప్రీమ్ హీరో సాయి తేజ్ తో ‘ప్రతి రోజు పండగే’ వంటి సూపర్ హిట్ కొట్టారు డైరెక్టర్ మారుతి. సినిమా సినిమా కి తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న మారుతి కి ప్రముఖ నిర్మాత మారుతి డైరెక్షన్ లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి దర్శకుడిగా ఆయనకు 10 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఆఫర్ పట్ల మారుతి కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here