ప్రతిరోజు పండగే లో నా క్యారెక్టర్ బబ్లీ గా,ఎంటర్టైనింగ్ గా ఉంటుంది – హీరోయిన్ రాశి ఖన్నా

1
733

‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోలతో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు రాశిఖన్నా. ప్రస్తుతం సుప్రీం హీరో సాయి తేజ్ హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లోఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” లో నటిస్తుంది. డిసెంబర్ 20న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నా ఇంటర్వ్యూ..

ఈ చిత్రంలో మీ క్యారెక్టర్ గురించి?
– ఈ చిత్రంలో రాజమండ్రికి చెందిన టిక్ టాక్ సెలబ్రిటీ ఏంజెల్ అర్నా పాత్ర చేశాను. మొదట్లో నాకు టిక్ టాక్ తెలీదు. ఈ కథ వింటున్నప్పుడు నా క్యారెక్టర్ పేరు ఏంజెలా ఏంటి? టిక్ టాక్ సెలబ్రిటీ ఏంటి? అని అనుకున్నాను. ఆ తర్వాత టిక్ టాక్ ఫన్ కోసం తెలిసింది. నా క్యారెక్టర్ కు అందరు బాగా కనెక్ట్ అవుతారు.

మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా టిక్ టాక్ సెలెబ్రిటీస్ ఉన్నారా?
– ఫ్రెండ్ లో టిక్ టాక్ చేసేవారు ఉన్నారు. క్యారెక్టర్ కోసం కొంతమంది టిక్ టాక్ సెలబ్రిటీలను కలిశాను. ‘జిల్’ సినిమా తర్వాత నేను మళ్ళీ బబ్లీ క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలోనే.

సాయి తో సెకండ్ టైమ్ వర్క్ చేశారు కదా! ఎలా అనిపించింది?
– సాయితేజ్ చాలా మంచి కో స్టార్. తనతో వర్క్ చేయడం కంఫర్ట్ ఉంటుంది. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను.

డైరెక్టర్ మారుతి మేకింగ్ గురించి?
– ఏంజెల్ అర్నా పాత్రకు నేను న్యాయం చేయగలనని దర్శకుడు మారుతిగారు నన్ను నమ్మారు. సెట్లో ఆయన చాలా క్లారిటీగా ఉంటారు. ఆర్టిస్టుల నుంచి తనకు కావాల్సింది రాబట్టుకుంటారు. చాలా హ్యూమరస్ గా ఉంటారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండేలా మారుతి గారు కథ రాశారు.

ఈ సినిమాలో మరో సారి మీరు పాట పాడారని తెలిసింది?
– నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. సింగర్ గా అవకాశాలు రావాలి కానీ చాలా లక్కీగా ఫీలవుతా. చిన్నప్పుడు నేను మ్యూజిక్ కూడా నేర్చుకున్న..ఈ సినిమాలో మారుతి గారి సలహా మేర ఒక పాట పాడడం జరిగింది. థమన్ అద్భుతమైన స్వరాలు చేకూర్చారు. సమయాభావం వల్ల ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పలేక పోయాను.

వారం గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ అవడం ఎలా అనిపిస్తోంది?
– ‘వెంకీమామ, ప్రతిరోజూపండగే’ చిత్రాలు వారంగ్యాప్ లో విడుదలవడం ఎలాంటి ప్లాన్ లేకుండా జరిగిపోయింది. రెండు చాలా పెద్ద బేనర్లు. మంచి సపోర్ట్ అందించారు. ‘వెంకీమామ’ చిత్రంలో నేను పోషించిన హారిక క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో దానికి అపోజిట్ క్యారెక్టర్. బబ్లీగా కొత్తగా ఉంటుంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
– విజయ్ దేవరకొండ హీరోగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చేస్తున్నాను. అందులో చాలా సీరియస్ క్యారెక్టర్. షూటింగ్ సరదాగా సాగుతుంది. ఇంకా కొన్ని కథా చర్చలు జరుగుతున్నాయి. వాటి గురించి త్వరలో వెల్లడిస్తాను అని ఇంటర్వ్యూ ముగించారు రాశి ఖన్నా.

Rashikhanna – Pics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here