‘వెంకీమామ’ సక్సెస్ సెలబ్రేషన్స్!!

0
697

విక్ట‌రీ వెంక‌టేష్, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య కలిసి నటించిన భారీ ముల్టీస్టారర్ వెంకీమామ‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్స్‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి. సురేష్‌బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ ఈ చిత్రాన్నినిర్మించారు. విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న వెంకీమామ‌ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో బాణా సంచా కాల్చి, సక్సెస్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు చిత్ర యూనిట్.. ఈ సందర్భంగా…

స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ – “ఈరోజు ఉదయం నుండి నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రెగ్యులర్ స్ట్రాంగ్ కమర్షియల్ ఫిలిం కి ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయో అలాంటి రిపోర్ట్స్ వచ్చాయి. వెంకీ మామ ఒక సాలిడ్ కమర్షియల్ ఫిలిం. రోజు కలెక్షన్స్ చూస్తే సినిమా ఏ స్టాండర్డ్స్ కి వెళ్తుందో తెలుస్తుంది. త్వరలోనే సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తాం. మా చిత్రానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అన్నారు.

డైరెక్టర్ కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) మాట్లాడుతూ – “వెంకటేష్ గారి పుట్టిన రోజు నాడు సినిమా రిలీజ్ చేస్తున్నాం..ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ పడ్డాం. కాని ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అభినందిస్తుంటే హ్యాపీ గా ఉంది. మాకు సపోర్ట్ చేసినమీడియాకు ధన్యవాదాలు” అన్నారు.

కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – ” వెంకటేష్ గారికి, నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. ఒవర్సీస్ లో కూడా థియేటర్స్ పెరిగాయి. చాలా హ్యాపీ గా ఉంది. సురేష్ గారు అన్నట్టు ఒక సాలిడ్ కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా ఫ్యామిలీస్ ని, మాస్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. తప్పకుండా ఇద్దరి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ అవుతుంది.

హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ మాట్లాడుతూ – ” వెరీ హ్యాపీ. ఈ మూవీ నాకు చాలా స్పెషల్. ఇప్పుడే దేవి థియేటర్ లో ఫస్ట్ టైం సినిమా చూశాను. ఆడియన్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన వెంకీ మామ చిత్ర బృందానికి ధన్యవాదాలు” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here