వెంకీ మామ గ్రాండ్ ప్రీమియర్స్.. యూఎస్ @150

0
392

ఎట్టకేలకు వెంకీమామ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఇక రెగ్యులర్ ప్రమోషన్ స్పీడ్ పెంచింది. అలాగే సినిమా రిలీజ్ పనులు కూడా ఊపందుకున్నాయి. విక్టరీ వెంకటేష్ – నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆడియెన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాకు సంబందించిన ఓవర్సీస్ ప్రీమియర్స్ కి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సినిమాని యూఎస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. 150 లొకేషన్స్ లో సినిమా ప్రీమియర్స్ ని ప్రదర్శించనున్నారు. డిసెంబర్ 12వ తేదీన మధ్యాహ్నం 2గంటల నుంచి షోలు మొదలుకానున్నాయి. ప్రీమియర్స్ తోనే సినిమా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది. మల్టీస్టారర్ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక 13వ తేదీన భారత్ లో సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. పాయల్ రాజ్ పుత్ – రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించిన వెంకీ మామ సినిమాకు థమన్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here