బాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న తాప్సి పన్ను నెక్స్ట్ మరో సెన్సేషనల్ కథతో దేశాన్ని ఆకర్షించనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సి నటించనున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వస్తున్నాయి. తాప్సి కూడా అపుడపుడు ఈ బయోపిక్ పై స్పందించింది కానీ ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు.
అయితే రీసెంట్ గా ఆమె మిథాలీ పుట్టినరోజు సందర్బంగా చేసిన ఒక స్పెషల్ ట్వీట్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మిథాలీ చేత కేక్ కట్ చేయించిన తాప్సి పుట్టినరోజు సందర్బంగా నీకు ఎలాంటి పెద్ద గిఫ్ట్ ఇవ్వలో అంతు పట్టడం లేదని కామెంట్ చేసింది. కానీ తప్పకుండా నిన్ను నువ్వు తెరపై చూసి గర్వపడేలా చేస్తానని తాప్సి పేర్కొంది. శబాష్ మిథు అనే హ్యాష్ ట్యాగ్ తో సినిమా టైటిల్ కూడా రెవీల్ చేసింది. ఇక ప్రస్తుతం తాప్సి ‘కవర్ డ్రైవ్’ నేర్చుకుంటున్నట్లు తెలిపింది. రాహుల్ దొలకియా దర్శకత్వంలో వయాకాం 18 నిర్మించనుంది.