కాకినాడలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన అఖిల్, పూజా…….!!

0
296

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక సినిమా తెరక్కుతున్న విషయం తెలిసిందే. అఖిల్ 4వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై వాసు వర్మ మరియు బన్నీ వాసు నిర్మాతలుగా రూపొందుతున్న ఈ సినిమాను మంచి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా తాజా షెడ్యూల్ కు కొద్దిపాటి బ్రేక్ ఇచ్చిన హీరో, హీరోయిన్లు అక్కడి ప్రఖ్యాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో నేడు పాల్గొనడం జరిగింది. కాగా ఆ వేడుకకు విచ్చేసిన ఫ్యాన్స్ ను ఉద్దేశించి అఖిల్ కొద్దిసేపు మాట్లాడుతూ వారిని ఉత్తేజపరిచారు. ఇక ఆ వేడుక సందర్భంగా హీరో అఖిల్, హీరోయిన్ పూజ హెగ్డే లు కలిసి ట్రెడిషనల్ వేర్ లో దిగిన పిక్స్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా అఖిల్ 4 సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here