స‌రికొత్త పాయంట్ తో వస్తోన్న `మథనం` పెద్ద హిట్ అవుతుంది- ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్

0
492

శ్రీనివాస సాయి హీరోగా భావన రావు హీరోయిన్ గా అజయ్ మణికందన్ దర్శకత్వంలో కాశీ ప్రొడక్షన్స్ పతాకంపై దివ్యప్రసాద్, అశోక్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం “మథనం”. రియలిస్టిక్ కథాంశంతో లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఇండియాలో రిలీజ్ అవకుండా ఫస్ట్ టైం యు ఎస్ లో డిసెంబర్ 6న విడుదల కావడం విశేషం..ఆ తర్వాత ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.  కాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్యఅతిధిగా హాజరై మథనం ట్రైలర్ ని లాంచ్ చేశారు.. ఈ కార్యక్రమంలో సూపర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, హీరో  శ్రీనివాస సాయి, హీరోయిన్ భావన రావు, నటులు అజయ్ గోష్, రవి ప్రకాష్, సుభాష్, దువ్వాసి మోహన్, నటి హేమ, నిర్మాత దివ్య ప్రసాద్, దీప, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరామెన్ పిజి విందా, లిరిక్ రైటర్ పూర్ణచారి, తానా ప్రెసిడెంట్ సతీష్ వేముల, సెక్రటరీ రవిపోతుల, చిత్ర నిర్మాత అశోక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ… అశోక్ ప్రసాద్ ప్యాషన్ ఉన్న ఎన్ ఆర్ ఐ ప్రొడ్యూసర్. ట్రయిలర్ చాలా డిఫరెంట్ గా ఉంది. హీరో శ్రీనివాస్ సాయి ఐస్  ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. ఈ సినిమా యు ఎస్ లో విడుదల కావడం చాలా హ్యాపీగా ఉంది. నా సినిమా “వన్ నేనొక్కడినే” యు.ఎస్ లో బాగా ఆడింది. లేకపోతే నా కెరియర్ వేరేలా ఉండేది. కంటెంట్ బాగుంటే యు..ఎస్ ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారు.. ఈ సినిమా రియలిస్టిక్ లవ్ స్టోరీతో వస్తోంది.. మంచి సినిమా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.. నిర్మాతలు దివ్య, అశోక్ ప్రసాద్ కి పెద్ద సక్సెస్ రావాలి.. అన్నారు.

సూపర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం అశోక్ ఇండస్ట్రీలో నే ఉండేవాడు. అమెరికా వెళ్లి జాబ్ చేస్తూ.. డబ్బులు సంపాదించి ఈ సినిమా తీశాడు. సినిమా అంటే అతనికి పిచ్చి. దాంతోనే తన ఫ్రెండ్ ని డైరెక్టర్ని చేస్తూ ఒక మంచి సినిమా చేశాడు.  కొత్త పాయింట్తో ఒక మంచి ప్రయత్నం చేశారు. ఫస్ట్ టైం ఈ చిత్రం యు.ఎస్ లో రిలీజ్ కావడం విశేషం.. అన్నారు.

తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన మాట్లాడుతూ.. యు.ఎస్ లో సెటిల్ అయిన ఎన్ ఆర్ ఐస్  మన తెలుగువారు నవీన్ ఎర్నేని, అనిల్ సుంకర మంచి హిట్ చిత్రాలు తీసి సక్సెస్ ఫుల్ నిర్మాతలు అయ్యారు. వారిలాగే అశోక్ ప్రసాద్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది.. డిసెంబర్ 6న యు.ఎస్ లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి మా సపోర్ట్ ఉంటుంది. అక్కడ చిత్రం సెలబ్రేషన్స్ ని ఘనంగా జరపనున్నాం.. అన్నారు.

హీరో శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ.. నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు. అజయ్ మాస్టర్ డాన్స్ ఇనిస్టిట్యూట్ లో మిర్రర్స్ చూసుకుంటూ ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాను. అప్పట్నుంచి అజయ్ గారితో పరిచయం ఉంది. కథ వినగానే చాలా ఎక్సయిట్ అయ్యాను. మేకప్ లేకుండా నాచురల్ గా ఈ చిత్రంలో నటించాం. పిజి విందా అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రాన్ని  పిక్చరైజ్ చేశారు. అశోక్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు..సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని మా టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.. అన్నారు.

దర్శకుడు అజయ్ మణికంధన్ మాట్లాడుతూ.. కేరళ లో పుట్టి, చెన్నైలో పెరిగి, హైదరాబాద్ వచ్చి ఇక్కడ సినిమా తీయడం చాలా హ్యాపీగా ఉంది. నిజ జీవితంలో జరిగిన ఒక విషయాన్ని ఇన్ స్పైర్ అయి కథ రాశాను. అశోక్, దివ్యలకు స్టోరీ చెప్పాను. వారికి బాగా నచ్చింది. అప్పట్నుంచి వారిని వదలకుండా సినిమా పూర్తి చేశాను. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. అందరం కలిసి జెన్యున్ గా మంచి సినిమా చేశాం… అన్నారు.

నిర్మాత అశోక్ ప్రసాద్ మాట్లాడుతూ.. అజయ్ ఆరేళ్లుగా ఈ కథపై వర్క్ చేశాడు. డిసెంబర్ 6న మథనం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.  తెలుగు సినిమా హిస్టరిలో తొలిసారిగా మా సినిమాని ఇండియాలో రిలీజ్ చేయకుండా యు.ఎస్ లో విడుదల చేస్తున్నాం.  ఆ తర్వాత తెలుగు రిలీజ్ ఇండియాలో  ప్లాన్ చేస్తాం.. కోటగిరి చంటి గారి ఎడిటింగ్, పిజి విందా కెమెరా విజువల్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి.. హీరో శ్రీనివాస్, హీరోయిన్ భావన రావ్ పోటా పోటీగా నటించారు. బడ్జెట్ కి వెనకాడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించాం. అన్నారు.

శ్రీనివాస సాయి, భావనరావు, రవిప్రకాష్, హేమ, అజైగోష్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి వింద, సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్: షేక్ జానీ, కో- ప్రొడ్యూసర్: మదన్ తీగల, నిర్మాతలు: దివ్య ప్రసాద్, అశోక్ ప్రసాద్, దర్శకత్వం: అజయ్ సాయి మణికందన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here