రవితేజ ‘డిస్కో రాజా’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్….!!

0
674

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న తాజా సినిమా ‘డిస్కో రాజా’. విభిన్న కథా చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆకట్టుకునే వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రవితేజ సరసన నభ నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన ఈ సినిమాలోని ‘నువ్వు నాతో ఏమన్నవో’ అనే మెలోడీ సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలను అలరించడంతో పాటు, సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

కాగా నేడు ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. టీజర్ ని డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సినిమా యూనిట్ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ‘బ్యాడీ డాడీ ఆన్ ది వే’ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో రవితేజ లుక్ చూస్తుంటే, టీజర్ అదిరిపోవడం ఖాయం అంటూ మాస్ మహారాజ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఫోటోగ్రఫిని కార్తీక్ ఘట్టమనేని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020 జనవరి 24న రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here