’90 ఎంఎల్’ మంచి సంగీతంతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ – మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్

0
730

‘ఇష్క్‌’, ‘లవ్ లీ’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘మనం’ వంటి మ్యూజికల్ హిట్ చిత్రాలతో సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. ప్రస్తుతం యంగ్ హీరో కార్తికేయ, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న90ఎంఎల్ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఇంటర్వ్యూ…

90 ఎం.ఎల్‌ సినిమాలో మీ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది?
– 90 ఎం.ఎల్‌ అనేది కొత్తదనంతో కూడిన కథ. శేఖర్ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ డైరెక్టర్.
కథ ఎంత చక్కగాచెప్పాడో దాన్ని అంతకంటే బాగా కమర్షియల్ గా తెరకెక్కించారు. కార్తికేయ బయట ఎలా ఉంటాడో సినిమాలో అలానే చూపించాడు. ఈ చిత్రం కోసం పూర్తిగా మాస్‌ బీట్స్‌నే సిద్ధం చేశా. గతంలో నేను కొన్ని మాస్‌ గీతాలు చేశా. కానీ, పూర్తిస్థాయిలో మాస్‌ స్వరాలు సమకూర్చింది ఈ చిత్రానికే. మొత్తం ఆరు పాటలతో పాటు ఓ బిట్‌ గీతం ఉంటుంది.

ఒక హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తారా లేక కథకు తగ్గట్లుగా మ్యూజిక్ చేస్తారా?
స్టార్‌ కథానాయకుడితో చేస్తున్నప్పుడు ఆయన ఇమేజ్‌ను కథను దృష్టిలో పెట్టుకోని సిద్ధం చేస్తుంటా. ఎందుకంటే నేను ఒక ఆడియన్ గా కూడా అదే కోరుకుంటా. అలాగే మామూలు హీరోతో చేస్తున్నప్పుడు కథకు తగ్గట్లుగా స్వరాలు సిద్ధం చేసుకుంటా. చిన్న సినిమానా,పెద్ద సినిమానా అని కాదు నేను చేసే పనికి మనస్ఫూర్తిగా సంతృప్తి పొందాలనే అనుకుంటా. కొన్నిసార్లు మనం ఇచ్చిన సంగీతం పెద్ద హిట్‌ అయినా సినిమాకు ఆదరణ దక్కకపోతే మన శ్రమ వృథా అవుతుంటుంది. ఇలాంటప్పుడు కాస్త బాధగా ఉంటుంది.

మీకు ఎలాంటి పాటలకు సంగీతం చేయడం అంటే ఇష్టం?
– నాకు స్వతహాగా పెప్స్, మాస్‌బీట్లు చాలా ఇష్టం. నాకు మెలోడీ గీతాలతో ఎక్కువ హిట్లు అవడం వల్ల మాస్‌ చిత్రాలకు పని చేసే అవకాశం పెద్దగా దక్కలేదు. ఈ సినిమాతో ఆ కోరిక కూడా తీరింది.

ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటి ?
– నేనే మ్యూజిక్ చేశాను కాబట్టి మ్యూజిక్ ప్లస్ అని చెప్తా.. అది కాకుండా కార్తికేయ చేసిన కామెడీ, డాన్సులు రెండు పెద్ద ప్లస్ అవుతాయి.

ఈ మధ్య ఎక్కువగా గ్యాప్ తీసుకున్నారు?
– నేను చేయాలనుకున్న కొన్ని పెద్ద ప్రాజెక్టులు అనుకోకుండా చేజారడం వల్ల కాస్త విరామమొచ్చినట్లు అనిపిస్తోంది. కానీ ఇండస్ట్రీ లో ఎప్పుడేం జరుగుతుంది అన్నది మన చేతుల్లో లేదు. ఇదీ అంతే. నాకొచ్చిన అవకాశాలతో హ్యాపీ గా ఉంది.

ప్రస్తుతం పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది కదా! ఎలా అనిపిస్తోంది?
– ఇటీవల కాలంలో సినీప్రియుల్లో సంగీతాభిరుచి బాగా పెరుగుతోంది.దానికి తగ్గట్టుగానే కొత్తదనంతో నిండిన గీతాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది పాటలు నచ్చి థియేటర్లకొచ్చి సినిమాలు చూస్తున్నారు.

ఈ మధ్య ఖైదీ లాంటి సినిమాలో పాటలు లేవు అయినా పెద్ద హిట్ అయింది భవిష్యత్తులో పాటల్లేని సినిమాలొస్తే సంగీత దర్శకులకు పెద్ద దెబ్బే కదా?
– అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ అనే వాడు కేవలం పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇస్తాడు. ఒక వేల సినిమాలో పాటలు లేకపోయినా నేపథ్య సంగీతం కచ్చితంగా ఉండాల్సిందే. లిరిక్ ఉండదు కానీ మ్యూజిక్ ఉండాల్సిందే కదా. అయినా భారతీయ తెరపై నుంచి పాటెప్పుడూ కనుమరుగు కాదు. భారతీయ సినిమాలలో పాటలు అనేవి స్టాంప్ లాంటివి అవి తప్పకుండా ఉండాల్సిందే అని అని షారుఖ్‌ ఖానే చెప్పారు.

టెంపర్ తర్వాత పూరి గారిని మళ్ళీ కలిసారా?
– పూరి గారితో నాకు మంచి అనుబంధం ఉంది, రెగ్యులర్ గా మాట్లాడుతా అప్పుడప్పుడు కలుస్తుంటా. ఒక డైరెక్టర్ కంటే మంచి వ్యక్తి గా నాకు బాగా పరిచయం. తప్పకుండా త్వరలోనే ఆయనతో నా సినిమా ఉంటుంది.

మ్యూజిక్ డైరెక్టర్ మీద ఫారన్ మ్యూజిక్ కాపీ కొడతారని లేదా అదే ట్యూన్ మళ్ళీ ఇస్తారని రెండు కంప్లైంట్స్ ఉంటాయి కదా?
– ఎప్పుడైనా ఎక్కడైనా ఓ చక్కటి పాట విన్నప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకోని మనదైన శైలిలో ఓ కొత్త స్వరాన్ని సిద్ధం చేసుకోవడం కాపీ కాదు. కానీ, అదే పాటను మక్కీకి మక్కి దించేస్తే మాత్రం కచ్చితంగా అది కాపీనే అవుతుంది. నేనెప్పుడూ ఇలాంటి తప్పు చెయ్యలేదు.. చెయ్యను కూడా

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
– ప్రస్తుతం కన్నడ లో ఒక సినిమా అలాగే తెలుగులో రాజ్‌తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జి’ చిత్రానికి పని చేస్తున్నాను. ఇంకా కొన్ని తెలుగు సినిమాలకు డిస్కర్షన్స్ జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here