అర్జున్ సురవరం ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 4.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చెయ్యడం హ్యాపీగా ఉంది – సక్సెస్ మీట్ లో నిఖిల్

0
600

యువ క‌థానాయ‌కుడు నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్నినిర్మించిన చిత్రం`అర్జున్ సుర‌వ‌రం`. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌లై థ్రిల్లింగ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రసమర్పకులు బి. మధు, చిత్ర నిర్మాత రాజ్ కుమార్, హీరో నిఖిల్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, దర్శకుడు టి. సంతోష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదినారాయణ, సీనియర్ నటుడు నాగినీడు, నటుడు వాట్సన్ పాల్గొన్నారు.

చిత్ర నిర్మాత రాజ్‌కుమార్‌ అకెళ్ల మాట్లాడుతూ – చాలా సమస్యలను అధిగమించి ఈ సినిమాను రిలీజ్ చేశాము. సినిమా బాగుందని అందరూ అంటున్నారు. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. మా టీం అందరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశారు. అన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేసి ఇప్పుడు సక్సెస్ సాధించినందుకు సంతోషంగా ఉంది. మెగాస్టార్ గారు సినిమా చూసి మంచి సినిమా తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను అని ప్రీ రిలీజ్ కి గెస్ట్ గా వచ్చారు. ఆయన రాక నాకు మా టీం అందరిలో కాన్ఫిడెన్స్ ని పెంచింది. ఆయన ఈ సినిమాకు చేసిన సహాయాన్ని మాటల్లో చెప్పలేను. ఈ సక్సెస్ నాకు మరిన్ని సినిమాలు చెయ్యడానికి బూస్టప్ ఇచ్చిందని అన్నారు.

చిత్ర దర్శకుడు టి.సంతోష్‌ మాట్లాడుతూ – తెలుగులో నా తొలి చిత్రమిది. మమ్మల్ని సపోర్ట్‌ చేస్తున్న ఆడియన్స్ కు థ్యాంక్స్‌. అలాగే మా నిర్మాతలు మధు, రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు, షూటింగ్ సమయంలో వారి హెల్ప్ సపోర్ట్ మరువలేనిది. నిఖిల్, లావణ్య సినిమాకు మెయిన్ హైలెట్. నిఖిల్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేనిది. అర్జున్ సురవరం క్యారెక్టర్ కి లైఫ్ ఇచ్చారు. నాగినీడు క్యారెక్టర్ సినిమాకు బ్యాక్ బోన్ లాంటిది. అలాగే వెన్నెల కిషోర్, పోసాని క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయి. నన్ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఠాగూర్ మధు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రాజశేఖర్ గారు అన్ని రకాలుగా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదినారాయణ గారు ప్రొడక్షన్ టీం కి, డైరెక్షన్ టీం కి ఒక బ్రిడ్జ్ లా పని చేశారు. మాకు వచ్చిన అన్ని సమస్యలను సాల్వ్ చేశారు. మా సినిమాని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అన్నారు.

సీనియర్ నటుడు నాగినీడు మాట్లాడుతూ – ” మంచి సినిమా. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. రిలీజ్ లేట్ అయినప్పటికీ చిరంజీవి గారు ఫంక్షన్ కి వస్తున్నారు అనగానే మేము సక్సెస్ అయ్యాం అనుకున్నా. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన సంతోష్ గారికి, రాజశేఖర్, మధు గారికి థాంక్స్” అన్నారు.

హీరోయిన్ లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ – ” సినిమా బాగుందని అందరూ అంటుంటే హ్యాపీగా ఉంది. ఈ ఏడాది విడుదలైన నా మొదటి తెలుగు సినిమా ఇంత సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి మూవీలో పార్ట్ అయినందుకు ముందుగా నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిత్ర యూనిట్ సభ్యులందరికి అభినందనలు” అన్నారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ – “అర్జున్ సురవరం ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 4.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చెయ్యడం హ్యాపీగా ఉంది. మా చిత్ర యూనిట్ అందరూ ఈ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నాము. నిర్మాత ఠాగూర్ మధు గారు, రాజ్ కుమార్ గారి రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, సంతోష్ టేకింగ్ ఇలా అందరి ఎఫర్ట్ తో మొదటి ఆటనుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి హ్యాపీ అంటున్నారు. ఈ సినిమా చూసి అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి విషెస్ తెలిపారు. అలాగే హై కోర్ట్ లాయర్స్ నాకు గారు ఫోన్ చేసి మీ సినిమా గురించే మాట్లాడుకుంటున్నాం అన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో అర్జున్ సురవరం హాట్ టాపిక్ గా మారింది. ఠాగూర్ మధు గారు మేకింగ్ విషయంలో, పబ్లిసిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే రాజ్ కుమార్ గారు ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. కొంత గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరే మా సినిమాను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమాలో ఉన్న మెసేజ్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యింది. కన్నె కన్నె పాట వైరల్ అయింది, లావణ్య ఈ సినిమాలో మరో మంచి రోల్ చేసింది. తాను ట్రూ ఆల్ రౌండర్. సినిమా చూడనివారు చూడండి, మిమ్మల్ని అర్జున్ సురవరం తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాడు. త్వరలో అర్జున్ సురవరం సీక్వెల్ కి కూడా ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

నటుడు వాట్సన్ మాట్లాడుతూ – ” నా క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఖైదీ తరవాత మళ్ళీ నాకు ఇంత మంచి పేరు రావడం హ్యాపీ గాఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు”అన్నారు.

న‌టీన‌టులు:
నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టి.సంతోష్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు
నిర్మాత‌: రాజ్‌కుమార్ అకెళ్ల‌,
సంగీతం: సామ్ సి.ఎస్‌,
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య‌,
ఎడిట‌ర్: న‌వీన్ నూలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here