యూనివ‌ర్స‌ల్ పాయంట్‌తో తెర‌కెక్కిన `అర్జున్ సుర‌వ‌రం` నాకు చాలా స్పెషల్ మూవీ – యంగ్ హీరో నిఖిల్‌

0
1372

హ్యాపీడేస్, స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి విభిన్నకథా చిత్రాలతో మంచి కమర్షియల్ సక్సెస్ లను అందుకున్నారు యంగ్ హీరో నిఖిల్. ప్రస్తుతం నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ ఇంటర్వ్యూ..

రిలీజ్ ఆలస్యం అయిందికదా ఏమైనా ఒత్తిడికి గురయ్యారా?
– నేను చేసిన 17 సినిమాల్లో ఎప్పుడూ ఇలా అవ్వలేదు. మే 1న విడుదల కావాల్సిన మూవీ ఇన్ని నెలల తరువాత థియేటర్స్ లోకి వస్తుంది. ఓ సినిమా వాయిదాపడితే ఎవరికైనా అది మెంటల్లీ, ఫిజికల్లీ ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి సినిమాను బేబీలా ఫీల్ అవుతాం. ఆ బేబీ డేంజర్ లో ఉంది అంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. భయంతో పాటు నేను చాలా ఫీల్ అయ్యాను కూడా. ఆల్ మోస్ట్ ఇంటికెళ్లి ఏడ్చినంత పనిచేశాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.

ట్రైలర్ చూస్తుంటే నకిలీ సర్టిఫికెట్ ప్రధానాంశంగా కనిపిస్తోంది?
– అర్జున్ సురవరం అనేది కేవలం నకిలీ సర్టిఫికేట్ల మీద ఉండదు. అది కేవలం సినిమాలో చిన్న పాయింట్. ఇదొక యూనివ‌ర్స‌ల్ పాయంట్‌తో తెర‌కెక్కిన మూవీ. విద్యార్థులు ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్య మీద తీసిన సినిమా. ఏటా 15 లక్షల మంది స్టూడెంట్స్ యూనివర్సిటీల నుంచి బయటకు వస్తున్నారు. కేవలం 6లక్షల మందికే ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా 9 లక్షల మందికి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు అనే విష‌యాన్ని దాంతో పాటు చక్కటి పరిష్కారాన్ని కూడా చూపించాం.

అర్జున్ సురవరం స్టోరీ లైన్ ఏంటి?
– లావణ్య, వెన్నెల కిషోర్, సత్య, నేను ఒక టీమ్. ఈ నలుగురు టీమ్ సభ్యులు ఒక సమస్యలో పడాతారు, ఆ సమస్య నుండి వాళ్లు ఎలా బయటపడగలిగారు అనేది ముఖ్య కథ. మంచి సందేశం ఉన్న సినిమా ఇది. నేను ఎన్నో సినిమాలు చేశాను. కానీ ఇది నాకు స్పెషల్. ఎందుకంటే, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా నేనెప్పుడూ చేయలేదు. స్వామిరారా, కార్తికేయ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించిన వాటి వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. కానీ అర్జున్ సురవరం సినిమాలో థ్రిల్ తో పాటు సమాజానికి పనికి వచ్చే చిన్న మెసేజ్ కూడా ఉంటుంది.

ఈ ఆలస్యం వల్ల కెరీర్ పరంగా వెనుకబడ్డాను అనుకుంటున్నారా?
– హ్యాపీ డేస్ మూవీ చేసే ముందే మా అమ్మగారు… నీ సినిమా కుటుంబం మొత్తం కూర్చొని చూసేదిలా ఉండాలి అన్నారు. అందుకే సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటున్నాను. నెక్ట్స్ కార్తికేయ-2 చేయబోతున్నాను.వచ్చే నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్. గీతాఆర్ట్స్-2లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. వీటితో పాటు హనుమాన్ అనే మరో మూవీ చేయబోతున్నాను. ఈ సినిమాలన్నీ కొత్త కొత్త పాయింట్స్ తో వస్తున్నాయి. ప్రతి సంవత్సరం నా సినిమా ఒక‌టి విడుదలయ్యేలా చూసుకుంటున్నా కానీ నెక్ట్ ఇయర్ నుండి ఎక్కువ సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాను.

సినిమాలలోకి రావడానికి మీకు చిరంజీవి స్ఫూర్తి అన్నారు ఎలా?
– ఒక సారి స్కూల్ చిల్డ్రన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి చిరంజీవి గారు వచ్చారు. అప్పుడు నా ప్రదర్శన కూడా ఉంది. అప్పటికే చాలా సమయం కావడం వలన ఆయన నా ప్రదర్శన చూడకుండానే వెళ్లిపోయారు. నా డాన్సులు చూసి ఆయన నన్ను సినిమాలలోకి తీసుకెళతారేమో అనుకొనే వాడిని. అలా చిన్నప్పటి నుండి నాకు హీరో అంటే చిరంజీవి. మా ఫంక్షన్ కు చిరంజీవి రావడం చాలా ప్లస్ అయింది. అంత పెద్ద స్టార్ మా సినిమాను గుర్తించడమే ఎక్కువ. చిరంజీవి రాకుంటే ఈ సినిమాకు ఇంత బజ్ వచ్చేది కాదేమో. చిరంజీవి వచ్చిన తర్వాత అర్జున్ సురవరం సినిమాపై బజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లింది.
 
దర్శకుడు టి సంతోష్ గురించి చెప్పండి?
– ఆయన పని రాక్షసుడు, తనకు కావలసినది రాబట్టేవరకు వదిలిపెట్టేవారు కాదు. ప్రమాదాలు, దెబ్బలు తగులుతాయి అనేవి ఆయన పట్టించుకోరు. సినిమాలో ఓ సన్నివేశం కోసం నన్ను 36 సార్లు చెంపదెబ్బ కొట్టించాడు` ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి పాత్ర కూడా ఎంతో కీలకం. ఇన్నాళ్లు గ్లామర్‌ రోల్స్‌కే పరిమితమైన లావణ్య ఈ సినిమాలో యాక్షన్‌ ఎమోషనల్‌ సీన్స్‌లో నటించింది.

టైటిల్ ఎందుకు మార్చారు?
– ముందు ముద్ర అనే టైటిల్ అనుకున్నాం. మేము సినిమా స్టార్ట్ చేసే సమయానికి ఆ పేరుతో ఏ సినిమా రాలేదు కానీ మా సినిమా విడుద‌ల‌స‌మ‌యానికి అదే టైటిల్ తో మరో సినిమా రావడం విడుదలవడం వల్ల వెంటనే టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఈ మూవీలో హీరో పేరు అర్జున్. ఇక సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రముఖ జర్నలిస్ట్. ఆయన స్పూర్తితో సురవరం అనే సర్ నేమ్ తీసుకోని ‘ అర్జున్ సురవరం’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. ముద్ర కంటే ఈ టైటిల్ కే ఎక్కువమంది కనెక్ట్ అయ్యారు. ఇది రీమేక్ అయినప్పటికీ చాలా మార్పులు చేశాం. ఒరిజినల్ వెర్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు అభిరుచికి తగ్గట్లు దీన్ని ఎంటర్ టైనింగ్ గా మార్చాం.

  • రానాతో హాతీ మేరా సాథీ సినిమా చేయాల్సి ఉంది కానీ డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక ఆ సినిమా వదిలేశా. నా కెరీర్ లో అర్జున్ సురవరం లాస్ట్ రీమేక్. ఇక నేను రీమేక్స్ చేయను. సీక్వెల్స్ మాత్రం చేస్తాను.
  • https://industryhit.com/t/nikhil-siddharth-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here