మెలోడీ పాటలతో మెలోడీ బ్రహ్మ అని ఒక స్పెషల్ బ్రాండ్ సెట్ చేసుకున్న సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమా ఏదైనా అందులో కంటెంట్ కి తగ్గట్టుగా ట్యూన్స్ అందించడంలో ఆయనకు ఆయనే సాటి. సాంగ్స్ ఎంత బావుంటాయో సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అందుకే ఇప్పటికీ కూడా కొన్ని పెద్ద సినిమాలకు స్పెషల్ గా మణిశర్మని నేపథ్య సంగీతం కోసం సెలెక్ట్ చేసుకుంటారు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇస్మార్ట్ శంకర్ అనంతరం మణిశర్మ స్పీడ్ పెంచినట్లు అర్ధమవుతోంది. వరుసగా అవకాశాలు అందుకుంటూ మళ్ళీ తన బలాన్ని చూపిస్తున్నారు. రామ్ – కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.. అలాగే విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రానున్న ఫైటర్ సినిమాకు కూడా తనదైన శైలిలో ట్యూన్స్ రెడీ చేస్తున్నాడు. అలాగే మరో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ కి కూడా మెలోడీ బ్రహ్మని అనుకుంటున్నట్లు సమాచారం. వాటిపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడాల్సి ఉంది.


