కింగ్‌ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై షమ్మీర్ సుల్తాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్ లైన్. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం అనసూయ భరద్వాజ్,అవంతిక, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఓ సరికొత్త కామెడీ డ్రామా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 1న గ్రాండ్‌గా విడుదలై మంచి పాజిటీవ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – “ఈరోజు మీకు మాత్రమే చెప్తా ఫంటాస్టిక్ సెలెబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఈ సెలెబ్రేషన్స్ కి ఫస్ట్ రీజన్ ఏంటంటే మా అందరి కలలు నిజం అయ్యాయి. ఈ గత నాలుగు సంవత్సరాలుగా ఈ టీమ్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. మొదట్లో నాకీ చిత్రసీమలో అసలు నటుడిగా అవకాశం దొరుకుతుందో, లేదో? అనిపించేది. కానీ, ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్ల ఇంతస్థాయికి చేరుకున్నా.ఇప్పుడు నిర్మాతగా సినిమా విడుదల చేసి ఇప్పుడు సక్సెస్ సెలెబ్రేషన్స్ చేస్తున్నాను. నా జీవితంలో చాలా కలలు ఈరోజు నిజం అయ్యాయి. అలాగే అంతా కొత్తవారు, కొత్త కంటెంట్ అయినా ఇంతమంచి ఓపెనింగ్స్ రావడం హ్యాపీ గా ఉంది. నిన్న నైజాం లో 80 % ఆక్యుపెన్సీ ఉంది. ఈరోజు, రేపు ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. థియేటర్ లోకి వెళ్ళినప్పుడు ఆడియన్స్ నవ్వుతూ ఉంటే దానంత శాటిస్స్ఫ్యాక్షన్ మరొకటి ఉండదు. నిన్న ఏ థియేటర్ కి వెళ్లిన అంతా నవ్వులతో నిండి పోయింది. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో సినిమాకి వెళ్ళండి. మీకు రెగ్యులర్ గా ఉండే స్ట్రెస్ నుండి రిలీఫ్ దొరుకుతుంది దానికి నాది గ్యారెంటీ. సీట్లో కూర్చొని నవ్వుకుంటున్నప్పుడు నన్ను దీవించండి చాలు. నా ఫస్ట్ ప్రొడక్షన్ కి ఇంత ప్రేమ ఇచ్చినందుకు ప్రతీ ఒక్కరికి థాంక్యూ” అన్నారు.
దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ మాట్లాడుతూ – ” నిన్న ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాను . ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఉద్దేశ్యం కూడా అదే. ఒక జెన్యూన్ స్టోరి టెల్లింగ్ ద్వారా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం. షూటింగ్, రైటింగ్ అంతా చాలా ఫన్ గా జరిగింది. నా లాంటి ఒక కొత్త డైరెక్టర్ కి ఇదొక కంప్లీట్ ఎక్స్పీరియన్స్. మీఅందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు” అన్నారు.
హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ – “మనం ఏదయినా పనిని ప్రేమతో. ఇష్టం తో సిన్సియర్ గా చేస్తే దానిలోనే దేవుడు ఉంటాడు అని నమ్మేవ్యక్తులం మేము. అలా ఇష్టంతో ప్రేమతో చెన్నై నుండి ఇక్కడికి వచ్చాడు షమ్మీర్. అలాగే ఐటీ జాబ్ చేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చింది పావని, అనురాగ్ గారు సిఏ చేసి ఇక్కడికి వచ్చారు. అలాగే విజయ్ ఇష్టంతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అందుకనే ఇంత అప్రిసియేషన్ వస్తుంది. రెండు గంటలు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుతున్నారు. అదొక మంచి ఎక్స్పీరియన్స్. విజయ్ ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో నిర్మించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు అభినవ్ గోమటం మాట్లాడుతూ – “నిన్న ప్రసాద్ ఐమ్యాక్స్, శాంతి థియేటర్స్ లో ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాం. మేము ఏదయితే ప్రీ రిలీజ్ లో చెప్పామో అదే ఆడియన్స్ నుండి వింటుంటే హ్యాపీ గా అనిపించింది. మీ అందరి సపోర్ట్ తోనే సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్” అన్నారు.
ఈకార్యక్రమంలో హీరోయిన్స్ అవంతిక మిశ్ర, పావని గంగిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శివ కుమార్, కో డైరెక్టర్ అర్జున్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ సమాధానమిచ్చారు..
నిర్మాతగా మారి ఇలా సక్సెస్ సెలెబ్రేట్ చేసుకుంటానని అనుకున్నారా?
– నిజానికి నేను ఓ నిర్మాణ సంస్థను పెడతానని, ఓ చిత్రాన్ని నిర్మిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే.. నిజానికి ఈ చిత్రాన్ని కూడా నేనే చేయాల్సింది. ‘అర్జున్‌రెడ్డి’తో నాపై అంచనాలు పెరగడం, తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారడం వల్ల ఈ సినిమా చేయకపోయినా, నిర్మిస్తా అని మాటిచ్చా. ఎందుకంటే వాళ్ళు పంపిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చూశా.. చక్కటి విలువలతో తెరకెక్కించారు. అది చూసినప్పుడు నాకు తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిలింస్ గుర్తొచ్చాయి. అందుకే నిర్మాతగా ముందుకొచ్చాను.
దర్శకత్వం చేసే ఆలోచన కూడా ఉందా?
– దర్శకత్వం అంటే ఇష్టమే.. భవిష్యత్తులో చేస్తానేమో. కాకపోతే చిన్న సమస్య ఉంది. నాకు సంభాషణలు రాయడం అంతగా తెలియదు. తరుణ్ భాస్కర్ ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది.
భవిష్యత్తులో తరుణ్‌తో కలిసి నటిస్తారా?
– ‘‘అదేంటండి.. నేను తన దర్శకత్వంలో మరో సినిమా చేయాలని ఎదురు చూస్తుంటే.. కలిసి నటిస్తారా? అని అడుగుతున్నారు.
తరుణ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నందుకు ఈర్ష్యగా ఉందా?
– అసలు అలాంటిదేం లేదు. కచ్చితంగా చెప్పాలంటే ఓ స్టార్ హీరో స్నేహితుడిగానో, సోదరుడిగానో ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. వాళ్ల పేరు చక్కగా ఉపయోగించుకుంటూ హ్యాపీగా గడపొచ్చు. ఇంతగా చెమటలు చిందిస్తూ కష్టపడాల్సిన అవసరం నాకూ ఉండదు.
నిర్మాతగా వరుసగా సినిమాలు చేస్తారా?
– నిర్మాతగా వరుసగా చేసేయాలి అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఓ ప్రొడక్షన్ హౌస్‌ను నిర్వహించడం చాలా కష్టమైన పని. ఇందులో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఒకవేళ మంచి ప్రతిభ ఉండి, సరైన అవకాశలు దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్లు ఎవరైనా ఉంటే.. వాళ్ల టాలెంట్‌పై నాకూ నమ్మకం కుదిరితే.. కచ్చితంగా నావైపు నుంచి అవకాశాలు అందివ్వడానికి ప్రయత్నిస్తా. త్వరలో నా బ్యానర్ నుంచి రాబోయే రెండో చిత్రాన్ని సైతం కొత్తవాళ్లతోనే చేయబోతున్నా. సృజన్ అనే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. త్వరలోనే దీని గురించి క్లారిటీ ఇస్తాను.


