నటుడిగా మంచి పేరు సంపాదించి, అలానే నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన మెగా బ్రదర్ నాగబాబు నేడు తన 58వ జన్మదినాన్ని కుటుంబసభ్యుల మధ్య ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు వరుణ్ తేజ్, తనతో కలిసి దిగిన ఒక పిక్ ని సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు.
‘హ్యాపీ బర్త్ డే నాన్న, మీ ముఖం పై చిరునవ్వు చిందించడం కోసం ఏమి చేయడానికైనా నేను సిద్ధం, నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందకు మీకు కృతజ్ఞతలు, మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాను’ అంటూ వరుణ్ తన పోస్ట్ లో తెల్పడం జరిగింది. ఇక ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఒక సినిమాలో వరుణ్ హీరోగా నటిస్తున్నారు….!!


