మామా అల్లుళ్ళ వెంకీ మామ దీపావళి శుభాకాంక్షలు

0
830

టాలీవుడ్ లో ఈ ఏడాది ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వెంకీ మామ ఒకటి. వెంకటేష్ – నాగ చైతన్య మొదటిసారి ఫుల్ స్క్రీన్ పై అల్టిమేట్ కామెడీ ప్రజెంట్ చేయడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కామెడీ అనే కాకుండా మామ అల్లుళ్ళు యాక్షన్ ని కూడా అదే సమపాళ్లలో వెండితెరపై ప్రజెంట్ చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. అల్లుడు ఆర్మీ డ్రెస్ లో రఫ్ గా కనిపిస్తుంటే వెంక మామ మాస్ లుక్ తో దర్శనమిచ్చాడు.

దీపావళి సందర్బంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర దగ్గుబాటి – అక్కినేని అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ – నాగ చైతన్య సరికొత్త థ్రిల్ ఇవ్వనున్నట్లు అర్ధమవుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ డ్రామాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్యకు జోడిగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీత దర్శకుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here