‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో లేడీ అమితాబ్ విజయ శాంతి పవర్ఫుల్ లుక్….!!

0
656

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను పక్కా పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి గారు టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇకపోతే దీపావళి సందర్భంగా సినిమాలోని ఆమె అఫీషియల్ లుక్ పోస్టర్ ని నేడు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసింది సరిలేరు యూనిట్.

ఆ పోస్టర్ లో చీరకట్టుతో ఎంతో హుందాగా కూర్చుని ఉన్న విజయశాంతి గారి పై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా ఈ సినిమాలో ఆమె భారతి అనే పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. అలానే ఆమె క్యారెక్టర్ సినిమాలో ఎంతో కీలకమని అంటోంది సినిమా యూనిట్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫొటోగ్రఫీని అందిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here