స్వప్న సినిమా లేటెస్ట్ ‘జాతిరత్నాలు’ మోషన్ పోస్టర్ రిలీజ్…!!

0
945

స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్నదత్, ప్రియాంకదత్ కలసి బివి నందినిరెడ్డి దర్శకత్వంలో ఇటీవల ప్రొడక్షన్ నెంబర్ 6 గా ఒక సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అలానే దానితో పాటు వారి బ్యానర్ పై నాగ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరొక మూవీకి ‘జాతిరత్నాలు’ అనే టైటిల్ నిర్ణయించి, కాసేపటి క్రితం మోషన్ పోస్టర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ‘సత్ప్రవర్తన వల్ల త్వరగా బయటికొస్తున్న మా వాళ్ళు,

ఈ దీపావళికి మీ – జాతిరత్నాలు’ అంటూ స్వప్న సినిమా వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. యువ నటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి ముగ్గురూ ఖైదీల దుస్తుల్లో జైల్లో సరదాగా నవ్వుకుంటున్నట్లు ఆ పోస్టర్ లో గమనించవచ్చు. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీతాన్ని రాధన్, సినిమాటోగ్రఫీని మనోహర్ అందిస్తుండగా, ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here