విజిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ గురించి డైరెక్టర్ అట్లీ….!!

0
605

ఇళయదళపతి విజయ్ మరియు యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బిగిల్. తెలుగులో విజిల్ పేరుతో ఈ సినిమాను నిర్మాత మహేష్ ఎస్ కోనేరు, ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ఈనెల 25వ తేదీన తెలుగు మరియు తెలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లో ఎంతో వేడుకగా నిర్వహించారు.

ఇక ఈ వేడుకలో దర్శకుడు అట్లీ మాట్లాడుతూ, తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం హీరో విజయ్ అన్నే అని, ఆయనతో సినిమా చేసిన ప్రతిసారి తనకు ఎంతో ఉత్సాహంగా ఉంటుందని అన్నారు. ఇక తెలుగులో తనకు జూనియర్ ఎన్టీఆర్ గారంటే ప్రత్యేకమైన గౌరవం ఉందని, తన ప్రతి సినిమా రిలీజ్ తరువాత ఎన్టీఆర్ గారు ఆ సినిమా చూసి కాల్ చేసి, సినిమా అద్భుతంగా ఉందని ఎంతో ప్రేమతో మాట్లాడి నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేవారని అన్నారు. విజయ్ అన్న మరియు తన కాంబినేషన్లో వస్తున్న ఈ మూడవ సినిమా, గత రెండు సినిమాల మాదిరిగానే మంచి విజయాన్ని అందుకుంటుందని అట్లీ అన్నారు. బిగిల్ తరువాత షారుక్ ఖాన్ తో అట్లీ ఒక సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు ప్రచారం అవుతున్నాయి…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here