కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ మొత్తానికి ఆదిత్య వర్మను రెడీ చేశాడు. సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. ఇక రిలీజ్ అవ్వడమే తరువాయి. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ డోస్ పెరుగుతోంది. ఇక నేడు ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించిన చిత్ర యూనిట్ సినిమా తప్పకుండా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని తెలిపింది.
ఇక దర్శకుడు గిరిశయ కథానాయకుడు ధృవ్ డెడికేషన్ గురించి వివరించాడు, “ధృవ్ ఆదిత్య వర్మ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అతని అంకితబావం. కమిట్మెంట్ అద్భుతం. తండ్రి లాగే కొన్ని లక్షణాలను అలవర్చుకున్నాడు. కానీ కొన్ని సీన్స్ లలో షాట్స్ కోసం రెండు, మూడు టెక్స్ ఎక్కువగా తీసుకోవడం జరిగింది. కానీ ఫైనల్ గా మొదటిదే తీసుకున్నాం. ఈ విషయం చెప్పినందుకు సారి ధృవ్ ” అనితెలుగు దర్శకుడు గిరిశయ సరదాగా మాట్లాడారు. అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తమిళ్ లో నవంబర్ 8న రిలీజ్ కానుంది.
అసలైతే దీపావళి సమయంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ బిగిల్ – ఖైదీ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండడంతో ఫైట్ లో రిస్క్ అనవసరమని విక్రమ్ సినిమాను నవంబర్ కి షిఫ్ట్ చేశారు. మరి మొదటి సినిమాతో కుర్ర హీరో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.


