తన కుమార్తె నవ్య వైజయంతి ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నిర్మాత స్వప్న దత్..

0
839
వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వినిదత్ గారి కుమార్తెల్లో ఒకరైన స్వప్నదత్, తండ్రి వారసత్వంతో ఎప్పటినుండో సినిమా రంగంలో కొనసాగుతున్నారు. తమ వైజయంతి సంస్థ తరపున 2000వ సంవత్సరంలో నిర్మితం అయిన ఆజాద్ సినిమాతో తొలిసారి కో ప్రొడ్యూసర్ గా తన సినీ అరంగేట్రం ప్రారంభించిన స్వప్న గారు, అప్పటినుండి తమ సంస్థ నిర్మాణ బాధ్యతలు చూసుకోవడంతో పాటు,
తన సోదరి ప్రియాంక దత్ తో కలిసి త్రి ఏంజెల్స్ స్టూడియోస్ అలానే స్వప్న సినిమాస్ సంస్థల్లో కూడా భాగస్వామిగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల స్వప్నదత్, ప్రసాద్ వర్మ దంపతులకు ఒక పాప జన్మించింది. కాగా నేడు ఆ పాపకు నామకరణం చేసినట్లు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్వప్న తెలిపారు. ‘మా కుటుంబం నుండి మరొక సభ్యురాలిని నేడు ప్రపంచానికి పరిచయం చేస్తున్నాము, తనకు నవ్య వైజయంతి దత్ అనే పేరుని కుటుంబసభ్యులందరూ కలిసి నిర్ణయిచినట్లు’ స్వప్న తన ఇన్స్టాగ్రామ్ లో కాసేపటి క్రితం నవ్య ఫోటోను పోస్ట్ చేయడం జరిగింది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here