బాలక్రిష్ణ 105 శాటిలైట్ హక్కుల్ని దక్కించుకున్న ప్రముఖ ఛానెల్

1
596

నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బాలక్రిష్ణ 105వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత కొంత కాలంగా గ్యాప్ లేకుండా బాలయ్య సెకండ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. అలాగే మధ్య మధ్యలో సినిమాకు సంబంధించిన స్టిల్స్ ని రిలీజ్ చేస్తూ ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తున్నారు. ఎప్పుడులేని విధంగా సరికొత్త లుక్ లో బాలక్రిష్ణ నెక్స్ట్ సినిమాలో కనిపించబోతున్నట్లు పాజిటివ్ టాక్ వైరల్ అయ్యింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కి ఫాస్ట్ గా ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నారు. రీసెంట్ గా శాటిలైట్ హక్కులను ప్రముఖ తెలుగు ఛానెల్ జెమిని టీవీ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించకముందే సదరు ఛానెల్ రూలర్ సినిమా హక్కుల్ని అందుకున్నట్లు బాలక్రిష్ణ – సోనాల్ చౌహన్ కి సంబంధించిన లుక్ ని రిలీజ్ చేశారు. ఈ టైటిల్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఈ సినిమాకు సీనియర్ దర్శకుడు కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. జై సింహా అనంతరం వీరి కాంబినేషన్ లో వస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక బాలక్రిష్ణ సరసన సోనాల్ చౌహన్ హీరోయిన్ నటిస్తోంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలోనే స్పెషల్ ఏనౌన్స్మెంట్ వెలువడనుంది

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here