చియాన్ విక్రమ్ 58 మూవీలో బౌలర్ ఇర్ఫాన్ పఠాన్

0
258

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న 58వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమయింది. ఇక ఈ సినిమాలోని ఒక పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ రోల్ కోసం, ప్రముఖ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ని ఎంపిక చేయడం జరిగింది. ఇక ఈ సినిమా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కాసేపటి క్రితం తెలియచేశారు. ఈ సినిమాలో ఇర్ఫాన్ పోషించనున్నది ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర అని కోలీవుడ్ వర్గాల సమాచారం.

ఈ సినిమా గురించి ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, చియాన్ విక్రమ్ అంటే తనకు ఎంతో అభిమానమని, అలానే ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏ ఆర్ రెహమాన్ గారు పని చేస్తున్న ఈ సినిమాలో తాను కూడా భాగం కావడం అదృష్టం అని అన్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితం అవుతున్న ఈ సినిమాకు శివకుమార్ విజయన్ ఫోటోగ్రఫిని అందిస్తుండగా, అమరన్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇటీవల తమిళ్ లో వచ్చిన కడైకుట్టి సింగం, మాన్స్టర్ సినిమాల్లో నటించిన ప్రియా భవాని శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here