వరుణ్ తేజ్ నెక్స్ట్ పంచ్

0
869

F2 – గద్దల కొండ గణేష్ వంటి డిఫరెంట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న మెగా యువ హీరో వరుణ్ తేజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు. ప్రయోగాత్మకమైన పాత్రలను ఎంచుకుంటు అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతున్న వరుణ్ ఈ సారి కిక్ బాక్సర్ గా బాక్స్ ఆఫీస్ పంచ్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. నేడు వరుణ్ తేజ్ 10వ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.

ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్ (అల్లు బాబీ) ఈ సినిమా ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇక థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నాడు.

గతంలో థమన్ వరుణ్ తొలిప్రేమ సినిమాకు మంచి ఆల్బమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక షూటింగ్ ని ఈ ఏడాది డిసెంబర్ లో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అల్లు వెంకటేష్ తో పాటు సిద్ధు నిర్మాత గా ఉన్న ఈ సినిమాను రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్ లో రూపొందించనున్నారు. త్వరలోనే సినిమా నటీనటుల వివరాలు తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here