పునర్నవి ‘సైకిల్’ లుక్

0
1519

మొన్నటివరకు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా కొనసాగిన పునర్నవి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటోంది. హౌజ్ నుంచి వచ్చిన అనంతరం కూల్ గా విశ్రాంతి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తోంది. ఇకపోతే చాలా రోజుల తరువాత పునర్నవి సినీ కెరీర్ తో బిజీ కానుంది. ఉయ్యాల జంపాల సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ గర్ల్ బిగ్ బాస్ హౌజ్ లో ఛాన్స్ కొట్టేసి మరింత క్రేజ్ అందుకుంది.

ఇక ఇప్పుడు సైకిల్ అనే కొత్త సినిమాలో నటిస్తోంది. ఏ నాన్ పొల్యూటెడ్ ఫిల్మ్ అనేది సినిమా ట్యాగ్ లైన్. విజయదశమి సందర్భంగా సినిమాకు సంబంధించిన స్పెషల్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ లో పునర్నవి ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతోంది. గ్రే మీడియా – ఓవర్సీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లో రూపొందుతున్న ఈ సినిమాను బాలాజీ రాజు – రామ్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

పునర్నవి బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకోవడంతో సినిమాపై కొంత బజ్ క్రియేట్ అయ్యిందనే చెప్పాలి. యువ దర్శకుడు అట్లా అర్జున్ రెడ్డి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాతో పునర్నవి ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here