బిగిల్ ట్రైలర్ డేట్ ఫిక్స్

0
737

దళపతి విజయ్ ఈ సారి బాక్స్ ఆఫీస్ వద్ద ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. బిగిల్ సినిమా బజ్ ఇప్పుడు మాములుగా లేదు. తెలుగులో కూడా ఈ సినిమా విజిల్ టైటిల్ తో భారీగా రిలీజ్ కానుంది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్ ని పెంచుతోంది.

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగిల్ ట్రైలర్ కి కూడా డేట్ ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 12న సాయత్రం 6గంటలకు ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు అధికారిక వివరణ ఇచ్చారు. ఇప్పటికే రిలీజైన పాట ఇంటర్నెట్ లో ట్రెండ్ సెట్ చేయగా ఇక ట్రైలర్ కూడా మిలియన్ వ్యూవ్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయగలదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

మెర్శల్ – తేరి వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తుండడంతో బిగిల్ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. తెలుగులో ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పై మహేష్ కోనేరు రిలీజ్ చేయనున్నారు. ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ – జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. మరి సినిమా సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here