ఫ్యామిలీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న ఎవర్ గ్రీన్ హీరోయిన్ స్నేహ మరోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఆమె సీమంతం వేడుకను కుటుంబ సభ్యులు గ్రాండ్ గా నిర్వహించారు. 2012లో తమిళ్ యాక్టర్ ప్రసన్నని స్నేహ ఇష్టపడి వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తరువాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్పెషల్ రోల్స్ లో కనిపిస్తున్నారు.
ఇక కొన్నేళ్ల క్రితం పెద్ద కుమారుడు నిహస్ కి జన్మనిచ్చిన స్నేహ దంపతులు ఇప్పుడు మరో బిడ్డకు స్వాగతం పలుకబోతున్నారు. ఇక ఆమె సీమంతానికి సంబందించిన ఈవెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్న స్నేహాకు అభిమానులు విషెస్ అందిస్తున్నారు.


