1000 పౌండ్ల వెయిట్ తో ‘ఎనర్జిటిక్ స్టార్ రామ్’ కసరత్తులు

0
737

ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్, అతి త్వరలో తన తదుపరి సినిమాను అనౌన్స్ చేయనున్నారు. ఇకపోతే ఎప్పటికపుడు తన ఫిజిక్ ని ఎంతో హెల్దీ గా మరియు ఫిట్ గా మెయిన్టెయిన్ చేసే రామ్, నేడు ఫిజికల్ ట్రైనర్ పర్యవేక్షణలో తన కాళ్ళతో ఏకంగా 1000 పౌండ్లున్న వెయిట్ ని లిఫ్ట్ చేస్తున్న ఒక వీడియోని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసారు.

‘ఇది వాళ్ళు చూడగలిగింది కాదు, నువ్వు చేయగలిగింది’ అంటూ ఆ వీడియో ని పోస్ట్ చేసారు రామ్. కాగా రామ్ పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here