‘అతనొక్కడే’, ‘కిక్’, ‘ఊసరవెల్లి’, ‘ధ్రువ’ లాంటిడిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరక్కేక్కిన సూపర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ మూవీ ‘సైరా’ నరసింహారెడ్డి. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, నయనతార, తమన్నా, జగపతిబాబు, రవికిషన్, నిహారిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రం 150వ జయంతిగాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా భారీ లెవల్లో సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇంటర్వ్యూ…
సైరా జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
– చిరంజీవిగారితో సినిమా చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. ‘ధృవ’ సక్సెస్ టూర్ అమెరికాలో జరుగుతున్నప్పుడు ‘ధృవ’ చూశాను చాలా బాగుంది అని ఫస్ట్ మెస్సేజ్ చిరంజీవిగారి దగ్గరినుండి వచ్చింది. ఆ రోజు ఈవినింగ్ చరణ్‌గారు ‘డాడీతో సినిమా చేద్దాం’ అన్నారు. ఆయన అలా అడగ్గానే చాలా సంతోషం కలిగింది. అమెరికా నుంచి రాగానే చిరంజీవిగారిని కలిశాను. ముందు ఓ స్టైలిష్ కమర్షియల్ ఎంటర్‌టైనింగ్ మూవీ చేయాలనుకొన్నాం. అప్పటికే చిరంజీవి గారి ‘ఖైదీ నెం 150’ రిలీజయ్యి పెద్ద హిట్ అయింది. అలా తరువాత బిగ్ మూవీ చేద్దాం అని మాట్లాడుకుంటున్న సమయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చిరంజీవిగారు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు కొంత టైం కావాలని చెప్పాను. అప్పటికి నరసింహ రెడ్డి స్టోరీ విన్నాను కానీ పూర్తిగా తెలీదు. నేనే పరుచూరిగారి దగ్గరికి వెళ్లి కథ వినడం జరిగింది. తర్వాత నేను మెంటల్‌గా స్ట్రాంగ్ అవ్వడానికి ఆయన గురించి రీసర్చ్ మొదలుపెట్టాను. అప్పటినుంచి ఆరు నెలలు రీసెర్చ్ చేశాను. చెన్నై లైబ్రరీలకు వెళ్లి బ్రిటిష్ వాళ్లు విడుదల చేసిన గెజిట్స్ పరిశీలించాను. తంగిరాల సుబ్బారావుగారు రాసిన పుస్తకాలు చదివాను. అందులో కొన్ని పాయింట్స్ బాగా నచ్చడంతో ఒక నెలలో ఫుల్‌బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని పరుచూరిగారి దగ్గరకు వెళ్ళాను. ఆయనకూడా బాగుంది అనడంతో చిరంజీవిగారి దగ్గరకు వెళ్లి ఓకే సర్ నేను చేస్తాను అని చెప్పడం జరిగింది.
గెజిట్స్‌లో కొన్ని పాయింట్స్ బాగా నచ్చాయి అని చెప్పారు అవి ఏంటి?
-ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. అయితే నేను ఆ గెజిట్స్‌లో పరిశీలించింది ఏంటంటే అతని వెనుక 9000 వేల మంది సైన్యం వచ్చారు అని. అప్పుడు నాకు ఒకటే అనిపించింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిజంగా ఒక బందిపోటు అయితే 9000 వేల మంది సాధారణ ప్రజలు సైన్యంలా ఎందుకు వస్తారు అని. అలాగే అతనికి ఉరిశిక్ష విధించి అతని తలను దాదాపు 30 సంవత్సరాలు కోట గుమ్మానికి వేలాడదీశారు. 250 మంది అతని అనుచరులకు ద్వీపాంతర శిక్ష వేశారు. అదీకాక ‘ఆతను చావుకు సిద్దపడే అక్కడికి వచ్చి యుద్ధం చేశాడు’ అనే పాయింట్ నాకు బాగా నచ్చింది.
మెగాస్టార్‌ని డైరెక్ట్ చేయడం ఎలా అనిపించి?
– చిరంజీవిగారితో సినిమా చేయడం అనేదే నాకు ఒక ప్రివిలేజ్. అలాంటిది ఇలాంటి ఒక చారిత్రాత్మక సినిమా రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన స్క్రిప్ట్‌లో కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు.
చిరంజీవి ఫ్యాన్స్‌కి ఆయన్ను ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు?
– బేసిక్‌గా ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే యోధుడి కథ. పొటెన్షియాలిటీతో కూడుకున్న మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌లోనే ఫ్యాన్స్ కోరుకునే అంశాలు బోలెడన్ని ఉంటాయి. నరసింహారెడ్డి క్యారెక్టర్‌లో చిరంజీవి గారు తప్ప నాకెవ్వరు కనిపించలేదు.
ఫస్ట్ టైం హిస్టారికల్ మూవీ చేస్తున్నారు కదా! ఎలాంటి జాగ్రత్తలు తీసుకొన్నారు?
– ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమా తీయాలని అనుకొన్నాక కూడా చాలా కాలం స్క్రిప్ట్‌మీద వర్క్ చేశాను. ఇటువంటి పీరియాడికల్ ఫిల్మ్‌కు బెస్ట్ ప్రొడక్షన్‌డిజైనర్ కావాలి కనుక రాజీవన్‌ను ఎంపిక చేసుకొని, ఆయనతో చర్చించాను. ఇలాంటి పీరియాడికల్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు ఆ నాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేయడం కోసం విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడడం సహజమే. అయితే ‘సైరా’లో విఎఫెక్ట్స్ తక్కువగా చేయాలనీ, సహజ వాతావరణాన్ని స ష్టించాలనీ ముందే అనుకొన్నాం. మా సినిమా ఆలస్యం కావడానికి ఇది కూడా ఓ కారణం. వాస్తవ సంఘటనలతో చేస్తున్న సినిమా కనుక వాస్తవానికి దగ్గరగా చిత్రీకరించాలనుకొన్నాం. రియలిస్టిక్‌గా, గ్రాండియర్‌గా చూపించాం.
నయనతార, తమన్నా పాత్రల గురించి?
– నరసింహారెడ్డి భార్యగా నయనతార, ప్రేయసిగా తమన్నా నటించారు. ఇద్దరివీ ముఖ్యమైన పాత్రలే. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయిగా అనుష్క నటించారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్. బిగినింగ్, ఎండింగ్‌లో ఆమె కనిపిస్తారు
ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్ల ఛాయిస్ ఎవరిది?
– నాకు ఈ సినిమాతో ఇద్దరు మెగాస్టార్లను డైరెక్ట్ చేసే అద ష్టం వచ్చిందంటే కారణం చిరంజీవిగారే. బేసిక్‌గా ఇది ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ కాబట్టి మిగతా క్యారెక్టర్స్‌కి కూడా మంచి ఇంపార్టెంట్ ఉంటుంది. సుదీప్ కూడా నరసింహరెడ్డిలాగే ఒక రాజు క్యారెక్టర్. ఈ ఉద్యమ సమయంలో బళ్లారి నుండి చెన్నయ్ వరకూ ఒకే దత్త మండలం కింద ఉండేది. ఈ ఉద్యమ సమయంలో తమిళ నాడు నుండి ఒక రాజు క్యారెక్టర్ వస్తుంది. అదే మన రాజ్‌పాండే క్యారెక్టర్ దాన్ని విజయ్ సేతుపతి చేశారు. నరసింహారెడ్డి గురువు గోసాయివెంకన్న క్యారెక్టర్. చిరంజీవి గారిని ఇన్‌స్పైర్‌చేసే క్యారెక్టర్ కాబ్బటి అమితాబ్ బచ్చన్ గారు ఆ పాత్ర చేస్తే బావుంటుందని అమితాబ్ గారిని ఓకే చేయడం జరిగింది.
చారిత్రక నేపథ్యం కలిగిన సినిమా కదా! డైలాగ్స్‌కి ఎలాంటి ఇంపార్టెంట్ ఉంటుంది?
– ఈ కథ మీద మొదటినుంచీ వర్క్ చేసిన వ్యక్తులు పరుచూరి సోదరులు. అందుకే వారి సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు తీసుకొన్నాం. అలాగే స్క్రిప్ట్ వర్క్‌లో నాకు మేజర్‌గా హెల్ప్ అయింది సాయిమాధవ్. బిగినింగ్ నుంచీ ఆయన నాతో ట్రావెల్ అయ్యారు. సీన్లలో ఆయన ఇన్‌వాల్వ్ అవడం వల్ల మంచి డైలాగులు రాయగలిగారు. ఆ డైలాగ్స్ సినిమాను ఇంకా పెద్ద రేంజ్‌కి తీసుకెళ్తాయి అనుకుంటున్నాను.
ప్యాన్ ఇండియా మూవీగా చెయ్యాలని ముందే డిసైడ్ అయ్యారా?
– అధికారాలన్నిటినీ బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసినా వెనుకంజ వేయకుండా, ప్రజల్ని ఏకం చేసి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలనే ప్రయత్నం కనుక సినిమాను ఓ ప్రాంతానికి పరిమితం చేయడం మాకు ఇష్టం లేదు. అందరికీ అర్థమయ్యే భాషలో ఉండాలి కనుక ప్యాన్ ఇండియా మూవీగా చేయడం జరిగింది. ఐదు సినిమా కష్టం ఈ సినిమాలో పడ్డాం కనుకనే మా అందరికీ ‘సైరా’ మేకింగ్ ఒక ఎపిక్ ఫీలింగ్ ఇచ్చింది.
హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
– యుద్ధాలు ఎలా ఉండాలో నేను డిజైన్ చేసి, ప్రీ విజువలైజ్ చేయించాను. తర్వాత హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు తీసుకున్నాం. మేం డిజైన్ చేసిన ప్రీ విజువలైజేషన్‌ను వారు అడాప్ట్ చేసుకుని నెక్ట్స్ లెవల్‌కు తీసుకువెళ్లారు. వారి డెడికేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక్క సీన్ కూడా అనవసరంగా షూట్ చేయరు.
ఈ సినిమాకు ముందు రహమాన్‌ని అనుకున్నారు కదా?
– మేము స్టార్ట్ చేద్దాం అనుకున్న సంవత్సరం తరువాత షూట్ స్టార్ట్ అయింది. అప్పుడు సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ చాలా బిజీ. టైమింగ్స్, డేట్స్ అడ్జస్ట్ కాలేదు. ఒక సాంగ్ అర్జంట్‌గా షూటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రామ్‌చరణ్, నేనూ… ఇద్దరం కూర్చుని అమిత్ త్రివేదీని తీసుకుందామని అనుకున్నాం. తర్వాత చిరంజీవిగారి దగ్గరకు వెళ్లాం. ‘మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటే గో ఎహెడ్’ అన్నారు. ఆ సాంగ్ షూట్ చేసి తీసుకువచ్చిన తరువాత చిరంజీవిగారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
జార్జియాలోనే షూటింగ్ చేయడానికి కారణం?
– మాకు 200 గుర్రాలు చాలా మంది ఫారెనర్స్ కావాలి. అలాగే ఎక్యూప్‌మెంట్స్,టెక్నీషియన్స్ అందరూ అక్కడి వారే కావాలి. వారందరు ఇక్కడికి వచ్చే కన్నా మనమే అక్కడికి వెళ్తే సమయం, డబ్బు ఆదా అవుతుందనే ఒక్క కారణంతోనే అక్కడ షూటింగ్ చేయడం జరిగింది.
నిర్మాత చరణ్ గురించి చెప్పండి?
– చరణ్ గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నేను అతన్ని చాలా దగ్గరగా చూశాను కాబట్టే ఈ విషయం చెప్పగలుగుతున్నాను. యూనిట్‌లో ప్రతి ఒక్కరిని చాలా బాగా చూసుకునే వారు. జార్జియాలో షూటింగ్ 60 డేస్ షూటింగ్ చేశాం. యూనిట్ అంతా అక్కడ 40 డేస్ ఉంది. అక్కడ ఒక ఎడారి ప్రాతం సెలెక్ట్ చేసుకొని 35- 40 డేస్ షూటింగ్ చేశాం. అక్కడ విపరీతమైన గాలి వీస్తుంది. అందుకని 200 గుర్రాలు 40 రోజులు ఉండేలా అక్కడే ఒక షెడ్‌ని బిల్డ్ చేశారు. అలాగే ప్రతి ఆర్టిస్ట్‌కి ఒక క్యాబిన్ క్రియేట్ చేశారు. లంచ్ చేయడానికి ఒక ఫ్లోర్ ఉన్నంత పెద్ద షెడ్ క్రియేట్ చేశారు. చాలా బడ్జెట్‌తో కూడుకున్నప్పటికీ కేవలం ఆర్టిస్టుల కంఫర్ట్ కోసం ఆలా చేశారు. ఇండియన్ హిస్టరీలో ఇంతవరకూ లేదనుకుంటా.. 250 మంది ఆర్టిస్టులు అబ్రాడ్ వెళ్లి షూటింగ్ చేయడం. అంతా పెద్ద స్టార్స్ అందరిని కూడాచాలా బాగా డీల్ చేసి బాగా చూసుకున్నారు. పర్సనల్‌గా కూడా చరణ్ చాలా మందికి ముందుండి హెల్ప్ చేస్తారు. కానీ అయన చెప్పుకోవడానికి ఇష్టపడరు.