2. నిఖిల్ కార్తికేయ 2 లుక్ రెడీ

0
697

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ చాలా రోజుల తరువాత దర్శనమిచ్చాడు. చివరగా కిర్రాక్ పార్టీ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ అర్జున్ సురవరం సినిమాను రెడీ చేశాడు. పలు కారణాల వల్ల వాయిదా పడ్డ ఆ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కానున్నట్లు నిఖిల్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. ఇక తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన కార్తికేయ క్యారెక్టర్ తో ఇప్పుడు సీక్వెల్ కి సిద్ధమవుతున్నాడు.

2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయ ఎలాంటి సక్సెస్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా దర్శకుడు చందు మొండేటి ఫైనల్ గా సీక్వెల్ కథను రెడీ చేశాడు. త్వరలో ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకనుంది. సినిమాలో లుక్ కోసం కథానాయకుడు పూర్తిగా మారిపోయాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫొటోలో మనోడు చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. చూస్తుంటే సెంటిమెంట్ తో నిఖిల్ స్ట్రాంగ్ హిట్ కొట్టేలా ఉన్నట్లు అర్థమవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here