కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాల పట్ల ఎంత ప్యాషన్ తో ఉంటారో ఆయన బిజీ షెడ్యూల్ ని చూస్తే అర్ధమవుతుంది. సాధారణంగా ప్రస్తుత రోజుల్లో ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు అంటే.. ఆ సినిమా రిలీజ్ వరకు మరో కథను ముట్టడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. కానీ సూర్య మాత్రం ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉంటారు. వాటే స్పీడ్.. అనేలా ఇప్పుడు మరో పని పూర్తి చేశారు
ఇటీవల బందోబస్త్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య ప్రమోషన్స్ లో పాల్గొంటూనే సుధా కొంగరా దర్శకత్వంలో తెరక్కేక్కుతున్న సూరారై పోట్రూ షూటింగ్ లో పాల్గొన్నాడు. సరిగ్గా అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ ని కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రంలో నట ప్రపూర్ణ మోహన్ బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండడం విశేషం. రీసెంట్ గా ఫైనల్ షెడ్యూల్ కి ఎండ్ కార్డ్ పెట్టిన చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులవైపు మళ్ళింది. ఆ పనులను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేసి సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాపై ఓ స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.


