ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా బిజీ అవుతోంది. ఇటీవల గద్దలకొండ గణేష్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న పూజ హిందీలో హౌజ్ ఫుల్ 4 సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ లో పూజా ఎవరు ఊహించని విధంగా రెండు డిఫరెంట్ గెటప్స్ లో దర్శనమిచ్చింది.
మహారాణి గా ఒక ఫ్రెమ్ లో ట్రెడిషినల్ లుక్ లో మెరిసి అలాగే ప్రస్తుత కాలానికి తగ్గట్టు గ్లామర్ గర్ల్ గా కూడా కనిపించింది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా లో స్టార్ క్యాస్టింగ్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. పూర్వ జన్మలను ప్రస్తుత జీవితాలకు కనెక్ట్ చేస్తూ దర్శకుడు నాన్ స్టాప్ కామెడీగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అక్షయ్ కుమార్ పాత్రను కూడా రీసెంట్ గా రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ త్వరలో సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేయనుంది. ఇక ఈ కామెడీ ఎంటర్టైనర్ ను వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 26న రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.


