వి వి వినాయక్ న్యూ లుక్

0
976

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వివి వినాయక్ ఎవరు ఊహించని లుక్ లో దర్శనమిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ప్రయోగాత్మక చిత్రంలో వినాయక్ కథానాయకుడిగా నటించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కోసం వినాయక్ పూర్తిగా మారిపోయారు. ఫిట్ నెస్ నుంచి హెయిర్ స్టైల్ వరకు అన్ని యాంగిల్స్ లో కొత్తగా కనిపిస్తున్నారు.

ఆదివారం జరిగిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వినాయక్ ను చూసిన స్టార్స్ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. స్టైలిష్ గ్లాసెస్ , జీన్స్ అండ్ షర్ట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. స్టార్ హీరోలను డిఫరెంట్ స్టయిల్లో చూపించిన వినాయక్ ఇప్పుడు తనను తాను మరింత కొత్తగా మార్చుకోవడం చాలా బావుందని ఆడియెన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక తన సినిమాను వినాయక్ ఈ ఏడాది ఎండింగ్ లో మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here