విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్

1
685

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌`. ఈ టైటిల్‌ను రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. టైటిల్ లోగోను కూడా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్ థెరిసా, ఇజబెల్లి లెయిటే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కాసేపటి క్రితం రిలీజ్ చేసింది సినిమా యూనిట్. లాంగ్ హెయిర్‌, సిగార్ పట్టుకుని ఫుల్ గడ్డం ఉన్న‌ విజ‌య్‌దేవ‌ర‌కొండ లుక్‌ను ఫ‌స్ట్ లుక్ చిత్ర యూనిట్ శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఇందులో విజ‌య్‌దేవ‌ర‌కొండ ముఖంపై ఉన్న ర‌క్త‌పు మ‌ర‌క‌లు క్యారెక్టర్ ఇన్‌టెన్సిటినీ తెలియ‌జేస్తుంది. అయితే ఈ స్టిల్ చూస్తుంటే ఇది కూడా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ అని అర్ధం అవుతోంది. ప్రస్తుతం సినిమా హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. నేషన‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here