యాక్షన్ హీరో గోపీచంద్ ఆడియెన్స్ కోరుకునే విధంగా మంచి స్పై థ్రిల్లర్ తో రెడీ అవుతున్నాడు. తిరు దర్శకత్వంలో రూపొందుతున్న చాణక్య సినిమా దసరాకి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ముందుగా టీజర్ తో యాక్షన్ ప్రియులని ఎట్రాక్ట్ చేసిన గోపి ఇప్పుడు సాంగ్స్ తో మరింత ఎట్రాక్ట్ చేసేందుకు సిద్దమవుతున్నాడు.
రొమాంటిక్ గా సాగే ‘డార్లింగ్’ అనే లవ్ సాంగ్ ని శనివారం విడుదల చేయబోతున్నారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఆ సాంగ్ సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కాబోతోంది. సినిమా రిలీజ్ వరకు ఒక్కో సాంగ్ తో సినిమాపై అంచనాలు పెరిగే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ పిర్జాద కథానాయిక.


