యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే పలు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ బల్గెరియా దేశంలో జరుగుతోంది.
ఈ షెడ్యూల్ లో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, విఎఫ్ఎక్స్ అందిస్తున్న శ్రీనివాస్ మోహన్, సహా మరికొందరు సినిమా యూనిట్ సభ్యులతో కలిసి అక్కడి క్రొప్రివ్టిట్సా ప్రాంతంలో దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ చేసారు కెమెరామాన్ కె కె సెంథిల్ కుమార్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను 2020 జులై 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు…..!!