బాలయ్య పాత్ర గురించి డైరెక్టర్ కెఎస్.రవికుమార్

0
718

ప్రతి సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే బాలకృష్ణ తన 105వ సినిమా కోసం మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించినట్లు అర్ధమవుతోంది. కెఎస్.రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో ఆడియెన్స్ కి సరికొత్త కిక్ ఇవ్వనున్నాడు. ఇటీవల రిలీజైన పోస్టర్ లో బాలకృష్ణ ఎంత స్టైలిష్ గా ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అయితే అలా కనిపించడానికి బాలయ్య బాబు చాలా కష్టపడ్డారట. ఆ విషయాన్నీ దర్శకుడు కెఎస్.రవికుమార్ తెలియజేశారు. ఒకదానికోటి సంబంధం లేకుండా అభిమానులను ఆకట్టుకునే విధంగా బాలకృష్ణ రెండు పాత్రలో కనిపించనున్నారని అలాగే ఫిట్ నెస్ కోసం వర్కౌట్స్ చేసి దాదాపు 11కేజీలు బరువు తగ్గినట్లు చెప్పారు. సినిమాలో ప్రతి సీన్ లో బాలయ్య చాలా కొత్తగా కనిపిస్తారని చెప్పిన రవికుమార్ డైలాగ్స్ కూడా అభిమానుల్ని అలరించనున్నట్లు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here