డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ ల కాంబినేషన్లో ఇటీవల రిలీజయిన సినిమా ఇస్మార్ట్ శంకర్. హీరో రామ్ ఎనర్జిటిక్ డాన్స్, పెర్ఫార్మన్స్, స్టైల్, అలానే పూరి మార్క్ అదిరిపోయే డైలాగ్స్, అదరగొట్టే యాక్షన్ సీన్స్, మణిశర్మ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఇద్దరు హీరోయిన్ల గ్లామర్ వెరసి సినిమాకు సూపర్ హిట్ టాక్ ని తీసుకువచ్చాయి. రిలీజ్ అయిన తొలి రోజు తొలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని అద్భుతమైన కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా, సక్సెస్ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంటోంది.
ఈ సందర్భంగా యూనిట్ 50 రోజులు పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. రామ్ సరసన నభ నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను, ఛార్మితో కలిసి పూరి, తన పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్ తో, అతి త్వరలో పూరి, విజయ్ దేవరకొండ ల కలయికలో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ….!!


