డిస్కో రాజా.. థమన్ వింటేజ్ బీట్

0
681
టాలీవుడ్ మాస్ రాజా మహారాజా ప్రస్తుతం డిస్కోరాజా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న గెటప్పులతో దర్శనమివ్వనున్నాడు. అయితే సినిమాలో కూడా డిఫరెంట్ మ్యూజిక్ ఉండాలని థమన్ సినిమా కథకు సింక్ అయ్యేలా వింటేజ్ స్టైల్ ని ఫాలో అవుతున్నాడు.
11 ఏళ్ల వయసులో జాజ్ డ్రమ్స్ వాయించేటప్పుడు తనతో అప్పుడు వర్క్ చేసిన సీనియర్ మ్యూజిషియన్స్ ని సినిమా కోసం పని చేయిస్తున్నట్లు తెలిపాడు. అందుకు సంబందించిన ఒక స్పెషల్ వీడియోని కూడా థమన్ షేర్ చేశాడు. ఇక ఈ గ్యాంగ్ కి ట్రిపుల్ కాంగో అని నామకరణం చేసిన థమన్ డిస్కోరాజా కోసం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. సరికొత్తగా ఉన్న ఆ బీట్స్ థమన్ లోని కొత్త కోణాన్ని చూపిస్తోంది. విఐ.ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న డిస్కో రాజా డిసెంబర్ లో విడుదల కానుంది.

 

View this post on Instagram

 

That vintage groove ♥️ for #discoraja 🕺🏿🎥🎬🎹🎹 @raviteja_2628

A post shared by thaman S (@musicthaman) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here