తెరపై కనిపించే నటీనటులు కేవలం నటనలోనే కాకుండా వివిధ రకాల స్కిల్స్ తో అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తుంటారు. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నాభా నటేష్ కూడా అభిమానుల మనసు గెలుచుకునేలా తన అద్భుతమైన మరో కళను బయటపెట్టింది. వినాయకచవితి సందర్బంగా మట్టితో వినాయకుడిని తయారు చేసింది.
గో గ్రీన్ గణేష్ అనే పదానికి సరైన అర్ధాన్ని చేసి చూపించింది. ఆమె ఎంతగా కష్టపడిందో వీడియో చుస్తే అర్ధమవుతుంది. ఇస్మార్ట్ శంకర్ లో తెలంగాణ యాసలో మాట్లాడి తన నటన కళను చూపించిన నాభా నటేష్ ఇప్పుడు సరికొత్త కళతో ఆకర్షించింది. ఆమె వినాయకుడిని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నిజంగా నువ్ స్మార్ట్ గర్ల్ అంటూ వినాయకుడి బొమ్మ కూడా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram


