ఆకట్టుకుంటున్న ‘నాని’స్‌ గ్యాంగ్‌లీడర్‌’ మెలోడియస్ థర్డ్ సాంగ్‌

0
674

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా, సెప్టెంబర్‌ 2న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాలోని మూడో పాటను విడుదల చేశారు. ‘నిన్ను చూసే ఆనందంలో…’ అంటూ సాగే ఈ పాటను అనంత శ్రీరామ్ రచించగా, సిద్ శ్రీ రామ్ పాడారు. అనిరుద్ రవిచందర్ సంగీతంతో రూపొందిన ఈ మెలోడీ ఎంతో ఆకట్టుకుంటోంది.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా చిత్రం సెప్టెంబర్ 13 న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here