అభిమానుల మనసు గెలుచుకోవాలంటే తెరపై నటిస్తే సరిపోదు. తెర వెనుక కూడా ఏ స్టార్ కి అయినా ఒక మంచి మనస్తత్వం ఉండాలి. అప్పుడే జనాలు అభిమానులై జై కొడతారు. సినిమాలతో సంభంధం లేకుండా అభిమానులకు బాగా దగ్గరైన నటుడు అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆయన జనాలకు ఎంత ఇష్టమో ఇటీవల ప్రకృతి ద్వారా కూడా బయటపడింది.
సాధారణంగా బిగ్ బి వీలైనంత వరకు ప్రతి ఆదివారం అభిమానులను కలుసుకుంటారు. రీసెంట్ గా అదే తరహాలో అభిమానులను కలిసేందుకు సిద్దమవ్వగా ఒక్కసారిగా బోరున వర్షం కురిసింది. అయినా కూడా అమితాబ్ ని చూడాలని అడుగు కూడా వెనక్కి వేయలేదు. వారి ప్రేమను చూసి బాలీవుడ్ మెగాస్టార్ ఎమోషనల్ అయ్యారు. వర్షంతో పాటు మీ అభిమానం – ప్రేమ కూడా జోరుగా కురిసిందని వారికి కృతజ్ఞతలు తెలిపారు.


