వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా నుంచి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. పాత్ర నచ్చితే తనదైన శైలిలో మనసు దోచుకుంటున్న ఈ బ్యూటీ లేడి ఓరియెంటెడ్ కథలపై ఇటీవల స్పందించింది. ఇంతవరకు తాను అలాంటి కథల్లో నటించకపోవడంపై పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని లేడి ఓరియెంటెడ్ కథలంటే చాలా ఇష్టమని ఒక వివరణ ఇచ్చింది.
కథనాయికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న స్టోరీలంటే.. సినిమా మొత్తం హీరోయిన్ చుట్టే తిరగాలని రూల్ ఏమి లేదు. కమర్షియల్ సినిమాల్లో కూడా అన్ని అంశాలు ఉండి మన పాత్రకు తగ్గ ప్రాధాన్యం ఉంటే సరిపోతుంది. రారొండోయ్ వేడుక చూద్దాం – జయ జానకి నాయక వంటి సినిమాలు కూడా కథనాయికకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే. నా దృష్టిలో అవి కూడా లేడి ఓరియెంటెడ్ అని చెప్పవచ్చు. అలాంటి సినిమాల్లో పాత్రకు తగ్గ ప్రాధాన్యం ఉంటే చాలు. అంతకు మించి నాకు ఆశలు లేవు. ఇప్పుడే అలాంటి కథల్లో కూడా నటించాలని పెద్దగా కోరికలు లేవు. ఇంకా కెరీర్ చాలా ఉంది’ అని రకూల్ కూల్ గా వివరణ ఇచ్చింది.


