అందుకే యాక్టర్ అయ్యానేమో: తరుణ్ భాస్కర్

0
592

విజయ్ దేవరకొండ తన కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం మీకు మాత్రమే చెప్తా. ఈ సినిమాలో దర్శకుడు తరుణ్ భాస్కర్ మొదటిసారి లీడ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇటీవల ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తరుణ్ భాస్కర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ చెప్పాడు.

‘నా చిన్న తనంలో మా అమ్మ రాసుకున్న ఒక నోట్ ని రీసెంట్ గా నాకు చూపించింది. నేను యాక్టర్ అవ్వాలని ఆమె అందులో రాసుకున్నారు. అనుకోకుండా ఇప్పుడు నేను కథానాయకుడిగా నటిస్తున్నా. బహుశా అందరూ అలా కోరుకోవడం వల్ల నటుడిని అయ్యానేమో.. కానీ నేనైతే డైరెక్షన్ వైపు అడుగులు వేశాను. ఒకవేళ నన్ను జనాలు యాక్టర్ గా అంగీకరించకపోతే సంతోషంగా నా డైరెక్షన్స్ – ఎడిటింగ్ తో బిజీ అవుతాను’ అని తరుణ్ వివరణ ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here